telugu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
telugu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, ఆగస్టు 2020, బుధవారం

కంప్యూటర్ లేకుండానే ప్రోగ్రామ్మింగ్ నేర్చుకోవచ్చా ? [Coding without computers]

కంప్యూటర్ లేకుండానే ప్రోగ్రామ్మింగ్ నేర్చుకోవచ్చా ? [కోడ్ ఆట ]

ప్రోగ్రామింగ్ అనేది ఒక ఆలోచనా  సరళి/విధానం ఇది అలవర్చుకోవటానికి కంప్యూటర్ అక్కర్లేదు . చిన్న పిల్లలకి ముఖ్యంగా ఈ కంప్యూటర్ అందుబాటులో లేని మరియు అటువంటి వాతావరణం చుట్టుపక్కన లేనటువంటి గ్రామీణ ప్రాంతాలలో పిల్లలకి చిన్నప్పుడే ఈ తరహా ఆలోచనా విధానాన్ని పరిచయం చెయ్యటం ద్వారా వారిని భవిష్యత్తులో నేర్చుకోవాల్సిన విషయాలకి సంసిద్ధులని చేసిన వాళ్ళం అవుతాము. కొన్ని బోర్డు గేమ్స్ ద్వారా  కొందరు ప్రోగ్రామ్మింగుని  పరిచయం చేయటం చూసాను. మన తెలుగు రాష్ట్రాలలో  పిల్లలకి ఇంకా సులువుగా అర్ధమయ్యేలాగా మా పిల్లకాయలతో కలిసి ఒక చిన్న ఆట  తయారు చేసాము . వాళ్ళు బాగా ఉత్సాహంగా ఆడారు. మీరు కూడా మీకు తెలిసిన పిల్లలకి ఈ ఆతని పరిచయం చేయొచ్చేమో చూడండి. 

ఈ ఆటకి ముగ్గురు పిల్లలు లేక రెండు జట్ల ఆటగాళ్లు కావాలి. సులువుగా ఉండటానికి ముగ్గురు పిల్లల్ని తీసుకుందాము. 

 ఆ.గా 1 , ఆ.గా 2  , మూడవది  తోటరాముడు  

ఈ ఆటలో ముఖ్య ఉద్దేశం కొన్నే కొన్ని ముందే అనుకున్న పదాలు మాత్రమే చెబుతూ  కళ్ళకి గంతలు కట్టుకున్న తోటరాముడు ని ఒక చోటనుండి బంగారం దెగ్గరికి తీసుకెళ్లాలి మరొక ఆటగాడు ముందే నిర్ణయించుకుని కొన్ని అడ్డంకుల్ని కల్పించాలి

ఉదాహరణకి ఆట మొదలయ్యేముందు అనుకున్న పదాలు .. 

1. రెండు అడుగులు ముందుకెళ్లు  [లేక ఆగే దాకా]

2. ఆగు 

3. కుడి వైపు తిరుగు 

(ఈ పదాలని  మెల్లిగా పెంచొచ్చు,  మరింత శక్తిని ఇవ్వొచ్చు  ఉద :అయ్యేదాకా , అయితే  కుడి వైపు తిరుగు )

అలాగే ఆ.గ 2 కి అందుబాటులో వున్నా అడ్డంకులు 

1. లోయ 

2. గోడ 

3.  మెట్టు 

4. బంగారం 

ఇప్పుడు తోటరాముడి కళ్ళకి గంటలు కట్టాలి , ఆ.గ 2 ముందుగానే అడ్డంకులు ఎక్కడ ఉన్నాయో పెట్టాలి (మేము ఇంట్లో గిన్నెలు పెన్నులు పెట్టుకున్నాము ) ఇప్పుడు ఇక ఆ.గ 1 వున్న అతి కొన్ని పదాలతో ఆ అడ్డంకుల్ని దాటించి తోటరాముడ్ని బంగారం దెగ్గరికి చేర్చాలి 


దీనివల్ల పిల్లలు గోల చెయ్యకుండా ఆడుకోవటమే కాదు అతి కొన్ని సూచనలతో పనులు ఎలా చెయ్యొచ్చో ఆలోచించగల్గుతారు. 
మీ అభిప్రాయాలని నాతో పంచుకోండి  

5, ఫిబ్రవరి 2020, బుధవారం

ప్రొగ్రామింగు లాంగ్వేజస్

ఈ సంచిక లో ఈ క్రింది  పది ప్రోగ్రామింగు లాంవేజస్ తీసుకుని వాటి గురించి చాలా పై పైన మాట్లాదుకుందాం

స్విఫ్ట్ , స్కాలా , జావా , జావాస్క్రిప్ట్, రష్ట్ , గో, కాట్లిన్ , పైథాన్, టైప్ స్క్రి ప్ట్ , క్లోజర్


26, డిసెంబర్ 2019, గురువారం

మెషిన్ లెర్నింగ్

అసలు నేర్చుకోవటం అంటే ఏంటి ? యంత్రాలు నేర్చుకోగలుగుతాయా ? 

బ్లాక్ చైన్

బ్లాక్ చైన్ 

సాంకేతిక రంగం మీద కాస్త దృష్టి పెట్టే వాళ్లకి ఇది సుపరిచిత  విషయమే
కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లోకి ఇప్పుడే అడుగు పెడుతున్న వాళ్లకి ఇది అంతగా అర్ధం అవ్వకపోవచ్చు సాధారణ ప్రోగ్రామింగ్ విషయాలకన్నా కాస్త భిన్నంగా ఉంటుంది . ఇది తెలుసు కోవటం కష్టమయిన విషయం కాదు కానీ కొత్త విషయం అవ్వటం వల్ల  సమాచారం అర్ధమయ్యే రీతిలో లభించటం కష్టం.

బ్లాక్ చైన్ అర్ధం చేసుకువాలంటే డేటాబేస్ లో నిక్షిప్తం చేసే సమాచారం గురించి ఆలోచించాలి . సాధారణ డాటాబేసులో సమాచారం ఒక కంపెనీ లేదా ఒక యాజమాన్యం అధీనంలో ఉంటుంది . దాని మీద హక్కులు కూడా వాళ్ళకే ఉంటాయి .ఆ డాటాబేసులో సమాచారాన్ని చూడాలి అంటే ఆ యాజమాన్యం యొక్క అనుమతి కావాలి. అంటే పారదర్శకత  తక్కువగా ఉంటుందన్నమాట. ఇలా కాకుండా సమాచారం మొత్తం అందరికి అందుబాటులో ఉందనుకోండి అప్పుడు ఆ సమాచారం మీద ఆధిపత్యం కేవలం  ఒక్కరికి కాకుండా అందరికి ఉంటే ? సరిగ్గా ఇలాంటి ఆలోచనల నుంచి పుట్టిందే  "వికేంద్రిత డేటాబేస్"
డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ [distributed ledger ]

ఇలా సమాచారాన్ని అందరికి అందుబాటులో ఉంచే వ్యవస్థ బ్లాక్ చైన్. దీని ముఖ్య ఆశయం ఏ ఒక్కరికి పూర్తి ఆధిపత్యం ఇవ్వకుండా అందరికి సమానంగా  సమాచారాన్ని ఉపయోగించుకునే వ్యవస్థ స్థాపించటం. ఇందులో ఎలాంటి సమాచారాన్నయినా నిక్షిప్తం చెయ్యొచ్చు . ఉదాహరణకి డబ్బు విలువ సమాచారం తో బిటీకాయిన్ అనే ఒక సమాంతర నగదు వ్యవస్థ ఏర్పడింది .. ఈ డబ్బుకి రిజర్వ్ బ్యాంకు అవసరం లేదు , ప్రభుత్వ అవసరం లేదు అందరికి హక్కు ఉంటుంది అలాగే ఏ ఒక్కరికి దీని విలువ నిర్ధారించే అధికారం ఉండదు.  దాని మంచి చెడులు మనకి ప్రస్తుతం అవసరం లేదు ...

ఇలానే భూమి పైన అధికారాన్ని చెప్పే నోటు పేపర్ల బదులు ఆ సమాచారాన్ని బ్లాక్ చైన్ వ్యవస్థలో చేర్చటంవల్ల ఆ సమాచారంపై ఒక ప్రభుత్వానికి కాకుండా అందరికి హక్కు ఉంటుంది దాని వాళ్ళ ఆ భూ క్రయ విక్రయాదులపై ప్రభుత్వ మధ్యవర్తిత్వం పోగొట్టోచ్చు ..పారదర్శకత పెంచొచ్చు

బ్లాక్ చైన్ లో సమాచారాన్ని బ్లాక్స్ (ఉద: 1 బ్లాక్ అంటే 1 MB సమాచారం) అంటారు ఒకొక్క బ్లాక్ కి తరువాత వచ్చే బ్లాకు ఒక గొలుసులాగా అనుసంధానం చేస్తారు .. రైలు పెట్టెల్లాగా మీరు ఊహించవచ్చు

ఒకసారి బ్లాక్ చైన్ లో సమాచారం స్టోర్ చేసాక ఆ సమాచారాన్ని మార్చలేం .. దీనినే ఇమ్మ్యూటబిలిటీ అంటారు అంటే మార్పు కి అవకాశం లేనిది అని

ఒక ప్రోగ్రామర్ గా మీరు చెయ్యాల్సింది
1) డేటాస్టోరేజ్  ఒక చోట కాకుండా బ్లాక్ చైన్ లో వుంది అని గుర్తించటం ,
2) అలాగే ఆ బ్లాక్ చైన్ పై సమాచారాన్ని ఎలా రాయొచో తెలుసుకోవటం , దానిని మళ్ళీ  ఎలా చదవచ్చొ  తెలుసుకోవటం
3) సమాచారాన్ని ఎవరు రాయాలి అనేది కూడా కాస్త భిన్నంగా ఉంటుంది , మైనింగ్ అంటే ఏంటో తెలుసుకోవటం అవసరం

ఈ విషయాలమీద మరింత సమాచారం పాడ్ కాస్ట్ లో వినొచ్చు

మీ అభిప్రాయాల్ని/ప్రశ్నలని  నాతో కామెంట్స్ లో పంచుకోండి

సెలవు






ప్రముఖంగా ..

కారకం (Agent)

ఏజెంట్ అంటే ఎవడు? మామూలు ప్రోగ్రామ్‌లకి వీటికి తేడా ఏంటి? ఇక మామూలు ప్రోగ్రామ్‌లు వ్రాయాల్సిన అవసరం ఉండదా? పదండి తెలుసుకుందాం ఏజెంట్ (...