12, జనవరి 2025, ఆదివారం

కారకం (Agent)

ఏజెంట్ అంటే ఎవడు? మామూలు ప్రోగ్రామ్‌లకి వీటికి తేడా ఏంటి? ఇక మామూలు ప్రోగ్రామ్‌లు వ్రాయాల్సిన అవసరం ఉండదా? పదండి తెలుసుకుందాం ఏజెంట్ (కారకం): స్వతంత్రంగా తన పరిసరాల స్పృహ కలిగి, భాష ఆధారంగా హేతుబద్ధ నిర్ణయాలు తీసుకోగలిగే ప్రోగ్రామ్‌నే కారకం (agent) అంటారు.
మామూలు ప్రోగ్రామ్‌లో ఒక నిర్దిష్ట పద్ధతిలో ఒక సమస్యను ఎలా పరిష్కరించాలో మనం వ్రాస్తాము. ఆ సమస్య ఇచ్చిన ప్రతిసారి అదే పద్ధతిలో ఆ సమస్య పరిష్కరించబడుతుంది. మరి దానికి మనం వ్రాయని ఒక సమస్య ఇస్తే? కొత్త సమస్యలు వచ్చినప్పుడు మనం మళ్లీ ప్రోగ్రామర్ల దగ్గరికి వెళ్లి ఒక మార్పు లేక కొత్త ప్రోగ్రామ్‌ వ్రాయించుకుంటాం. ఎలాగైతే ఆ ప్రోగ్రామర్ తనకి అందుబాటులో ఉన్న పరికరాలు/పనిముట్లు (ఉదా: APIs) రకరకాల పద్ధతిలో మేళవించి (orchestrate) సమస్యను పరిష్కరిస్తాడో అలాగే ఒక ప్రోగ్రామ్ ఇచ్చిన సమస్య ఆధారంగా ఎలా ఆ సమస్యను ఉన్న పరికరాల సహాయంతో సాధించచ్చో అని భాషా నమూనాల (LLM) వాడకంతో ఆ మేళవింపును కనుగొని సమస్యను పరిష్కరిస్తే అప్పుడు ఇందాక మనం చెప్పుకున్న agent పనులన్నీ ఈ ప్రోగ్రామ్ చేసినట్టే కదా. ఇక అన్ని పనులూ ఇదే చేసేస్తుంది అనుకోవటానికి లేదు... ఖచ్చితత్వంతో పరిష్కరించాల్సిన సమస్యలకు ఇంకా ఈ పద్ధతి సరిపోదు. కేవలం భాష ఆధారంగా హేతువును గ్రహించటం అన్ని వేళలా సాధ్యం కాదు. ఈ కారకాలు ప్రోగ్రామ్‌లు ఇంకాసింత సమయం సహజీవనం సాగిస్తాయి.

ప్రముఖంగా ..

కారకం (Agent)

ఏజెంట్ అంటే ఎవడు? మామూలు ప్రోగ్రామ్‌లకి వీటికి తేడా ఏంటి? ఇక మామూలు ప్రోగ్రామ్‌లు వ్రాయాల్సిన అవసరం ఉండదా? పదండి తెలుసుకుందాం ఏజెంట్ (...