13, ఫిబ్రవరి 2020, గురువారం

కార్యోన్ముఖ పరికల్పన [ops oriented design ]

పరిశ్రమలో సాప్టువేర్ రాస్తున్న ప్రతీ  ప్రోగ్రామర్ అంతిమ లక్ష్యం తమ ప్రోగ్రామ్ ఎక్కడో అక్కడ పని చెయ్యటం అనటంలో సందేహం ఏమి లేదు. ఇలా పని చేసే ప్రోగ్రాముని సరిగ్గా పని చేస్తోందా లేదా అని సరిచూసుకుంటూ  పని చెయ్యనప్పుడు సరైన నిర్ణయం తీసుకుని అది పని చేసేలాగా చూస్తూ ఆ ప్రోగ్రామ్ బాధ్యతని నెత్తిన వేసుకునే వాళ్ళు ఆపరేషన్స్ వాళ్ళు. ప్రోగ్రాం రాసిన  సమయం కన్నా దాని మరమ్మత్తుల మీద మనం ఎక్కువ సమయం కేటాయిస్తాం. అలాగే కష్టమర్ కి మనం పని చేస్తున్న కంపెనీ మీద వున్న అన్ని అభిప్రాయాలకి మనం రాసే సాఫ్టువేరే కారణం . దీనివల్లే ఈ క్షేత్రంలో  పనిచేసేవాళ్లని దృష్టిలో పెట్టుకుని గనక మన ప్రోగ్రామ్స్ రాస్తే వాళ్ళ పని సులువు చేసిన వాళ్ళం అవుతాము. దీని వాల్ల చాలా లాభాలు ఉంటాయి


  1.  ఒక వేళ మీ కంపెనీ లో చాలా ప్రోగ్రాములు నియోగించబడుతూ ఉంటే కనుక అన్నిటిని ఆపరేషన్స్ వాళ్లు ఒక క్రమ పద్దతిలో కాపలా కాయొచ్చు,  నియంత్రించవచ్చు 
  2. మీ సాఫ్టువేర్ యొక్క ఆర్యోగ్యం [పని తీరు] వాళ్ళకి సులువుగా అర్ధమయ్యేలాగా చేస్తే త్వరగా సమస్యలని పసి గట్టి మీకు చేరవెయ్యటానికి అలాగే మీ కష్టమరుకి చేదు అనుభవం కలగకుండా  వుండే  అవకాశం ఉంటుంది 
  3. పది రకాల సాఫ్టువేర్లు పది పది రాకాలుగా తమ పని తీరు సంబంధించిన ఇతివృత్తాలు (log records ) రాస్తే అర్ధం చేసుకోవటం చాలా కష్టం .. ఒక పద్దతిలో కనుక దీన్ని వినియోగిస్తే చాల ఉపయోగకరంగా వుంటుంది 
  4. కొత్తవాళ్ళకి మీ సాఫ్ట్వేర్ ని ఎలా కాపలా కాయలో కొత్తగా నేర్పించాల్సిన అవసరం ఉండదు 
  5. డెవలపర్ .. ఆపరేషన్స్  (Dev - Ops ) యుగంలో ఈ బాధ్యత ఒక ప్రోగ్రామర్ ఖచ్చితంగా నెరవేర్చాల్సిందే .. ఇది తన పని సులువుగా చేసే మార్గం కూడా 
  6. మీకు నచ్చేలా కాకుండా వాళ్ల పనికి సులువుగా ఉండేలాగా జాగ్రత్తలు వహిస్తే రాత్రిళ్ళు అందరు పడుకోవచ్చు
వీటిని దృష్టిలో పెట్టుకుని మీరు తాయారు చెయ్యబొయ్యే కొత్త సాఫ్టువేర్ పరికల్పన సమయంలోనే దాన్ని బాధ్యతగా చూసుకునేవాళ్ళని దృష్టిలో పెట్టుకుంటారని ఆశిస్తున్నాను 


5, ఫిబ్రవరి 2020, బుధవారం

ప్రొగ్రామింగు లాంగ్వేజస్

ఈ సంచిక లో ఈ క్రింది  పది ప్రోగ్రామింగు లాంవేజస్ తీసుకుని వాటి గురించి చాలా పై పైన మాట్లాదుకుందాం

స్విఫ్ట్ , స్కాలా , జావా , జావాస్క్రిప్ట్, రష్ట్ , గో, కాట్లిన్ , పైథాన్, టైప్ స్క్రి ప్ట్ , క్లోజర్


ప్రముఖంగా ..

రామ కోటి

ఐఫొన్లో మాత్రమే సరిగ్గా పనిచేస్తోంది.. బోలెడు తప్పులూ నిదానంగా రామజపం చేస్తూ కిందకి వెళ్ళండి .. సర్రున లాగేస్తే పని చెయ్యదు :-) ...