చేరవెయ్యటం ఒక పని అయితే వచ్చిన సందేశం సరిగ్గ వచ్చిందా లేదా అన్నది మరొక సమస్య
పూర్వం రాజుగారు రాసిన లేఖకి లక్క పూసి రాజ ముద్ర వేసి పంపించేవాళ్ళు
మీరు ఉద్యోగం లో చేరాక రక రకాల పదాలు వింటారు ఈ ఎంక్రిప్షన్ డీక్రిప్షన్ విషయంలో ....ఈ రొజు వీటి గురించి కొద్దిగా తెలుసుకుందాం
ఎప్పటిలాగే ఒక కధ
రాము జానకీ ప్రేమించుకుంటున్నారు. ఈ రోజు జానకి వాళ్ళ ఇంట్లూ ఎదో సంబరం .. చాలా మంది చుట్టాలు వచ్చి వున్నారు ..ఇలా వుంటే రాము అక్కడికి వచ్చాడు. జానకి చూసింది కాని మాట్లాడే ధైర్యం చేయలేదు . కిటికీ వాలుగా వచ్చి రాము క ఏ కేప్పు కడు కక కలు కద్దాం అని అన్నడు .. జానకి కళ్ళు పెద్దవి చేసుకుని క ఆ కారు అని పరిగెత్తి వెళ్ళిపోయింది .. పక్కన వున్న సరోజకి అర్ధం కాలేదు ఈ గోల ఏంటో
క భాష తెలిసిన వాళ్ళందరికి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు .. తెలియని వాళ్ళకి అర్ధం చేస్కొవటం కష్టం.. ఇది ఎంక్రిప్షన్ కి ఒక మంచి ఉదాహరణ .. సందేశాన్ని కాస్త మార్చి ఎదుటి వాళ్ళకి చేర వేస్తారు ..అది పుచ్చుకున్న వాళ్ళు దాన్ని అసలు భాషలోకి మార్చుకుంటారు .. ఈ ఎన్క్రిప్షన్ అసలు విషయం చెరిగిపోదు .. మధ్యలో చూసే వాళ్ళకి అర్ధం కాదు అంతే
ఇందాక కధలో రాము చేసింది ఎన్క్రిప్షన్ జానకి చేసింది డీక్రిప్షన్ .. సందేశాన్ని చేరవెయ్యటంలో ఈ రెండు పనులూ ఒక ఒప్పందం ప్రకారం జరుగుతాయి.. క భాషలో చెప్పిన వాక్యాన్ని జానకి చ భాషతో అర్ధం చేసుకోలేదు కదా .. కాబట్టీ క భాష అనేది ఇద్దరి మధ్య ఒప్పందం అన్నమాట .. దానినే ఇక్కడ కీ అంటారు .. ఎంక్రిప్షన్ కీ
దీనిలొ కాస్త మార్పులు చేర్పులతొ కంప్యుటర్ కి సంబంధించి చాలా వరకు రహస్య సమాచరన్ని జాగ్రత్తగా చేరవెయ్యొచ్చు .. మీ ఇంటర్నెట్ బ్రౌసర్ మీ బాంకు వివరాలు తెచ్చి మీకు చూపించటం దెగ్గర్నుంచి .. మీ ఆధారు నంబరు తదితర విషయాల సమాచార రవాణా ఇలాంటి ఎంక్రిప్షన్ ద్వారా జరుగుతుంది
క భాషలాంటి సులువయిన పిల్లలాటలు కాకుండా అత్యంత పఠిష్టమయిన పద్దతిలో ఈ ఎంక్రిప్షన్ జరుగుతుంది. ముఖయంగా "ఏ.ఈ.ఎస్" "బ్లోఫిష్" లాంటి పద్దతులతో ఈ ఎంక్రిప్షన్ చేస్తారు