తెలుగులో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్
అసలు ఇది సాధ్యపడే విషయమేనా ?
ఒక వేళ సాధ్యపడితే దీనివల్ల ఎమన్నా ఉపయోగం వుందా ?
దీని గురించి చాలా కాలంగా ఆలోచిస్తున్నాను , తప్పకుండా తెలుగు మాట్లాడే వాళ్ళకి తెలుగులోనే ప్రోగ్రాం రాయటం మరియు తెలుగులో ఆలోచించటంవల్ల వాళ్ళు పరిష్కరిద్దామనుకునే సమస్యలకు సులువయిన జవాబు లభించే అవకాశం వుంది.
ప్రతి ప్రోగ్రామ్ అమెరికాలోని ఒక సంస్థకి ఉపయోగపడే సమస్యని పరిష్కరించేది గా ఉండక్కర్లేదేమో, అలాగే ప్రతి ప్రోగ్రామర్ బిటెక్ చేసిన ఒక సాఫ్ట్వేర్ కూలి అవ్వక్కర్లేదు కదా.
ఒక సాధారణ షాప్ యజమాని తన రోజువారీ కార్యకలాపాల కోసం ఒక ప్రోగ్రాం రాసుకోగలిగితే ? చక చకా వాట్సాప్ వాడే టిఫిన్ సెంటర్ బాబాయి తన పనులకోసము ఒక చిన్న మొబైల ప్రోగ్రామ్ రాసుకోగలిగితే ?
ఇలా రాయటానికి ఏదన్నా పెద్ద ఇంజనీరింగ్ అవసరమా ? అసలు ప్రోగ్రామింగ్ అనేది కష్టమయిన పనేనా ?
నేను కేవలం తెలుగు మీడియం గురించి మాట్లాడట్లేదు ఒక భావాన్ని కంప్యూటరుకి సులువుగా వ్యక్తపరిచి కావలసిన పని చేయించుకోగలిగితే ఎంత మంది జీవితాలని ప్రభావితం చెయ్యగలం అని ఆలోచిస్తున్నాను
అసలు తెలుగులో ప్రోగ్రామ్ రాయటం ఒక వేళ కుదిరితే అది చూడటానికి ఎలా ఉంటుంది ? ప్రస్తుతం ఇంగ్లీషులో వున్న అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజస్ కి ఈ తెలుగు ప్రోగ్రామింగ్ కి ఎమన్నా వ్య త్యాసం వుంటుందా ?
మరెందుకు ఆలస్యం ? ఒక సారి అలాంటి ప్రోగ్రామింగ్ భాషని ఊహించి చూద్దాం
దీనికోసం అందరికి సులువుగా తెలిసిన జావా/జావాస్రిప్ట్ లాంటి ఒక ఊహాజనిత ఇంగ్లిష్ ప్రొగ్రామింగ్ లాంగ్వేజిని ఈ తెలుగు ప్రోగ్రామింగ్ భాషకి పోల్చి చూద్దాం
అలాగే ఈ ప్రోగ్రామింగ్ చేసేది మన కిరాణా కొట్టు సుధీర్, అతనికి కొన్ని చిన్న చిన్న ప్రోగ్రామింగ్ అవసరాలు రావొచ్చు
ఈ ఊహజనిత ప్రోగ్రాముకి ఇంగ్లీషు ప్రోగ్రామ్ కి తేడా పెద్దగా లేదు కానీ ఈ తెలుగు ప్రోగ్రాములో విషయం చాల సులువు అని తెలుస్తోంది కాదు. నేను నీలం రంగులో పెట్టినవి తెలుగు ప్రొగ్రమింగ్ లాంగ్వేజీ కి సంబంధించినవి
ఇలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తయారు చేయగలమా ? చెయ్యొచ్చు కాస్త సమయం కేటాయించాలి కానీ తప్పకుండ చెయ్యొచ్చు
నాతొ ఎవరన్నా కలిసి పని చెయ్యాలి అని అనుకుంటున్నారా .. నన్ను సంప్రదించండి . ప్రోగ్రామింగ్ అందరికి అందుబాటులోకి తీసుకురావచ్చు .. విఫలమయినా కూడా నష్టంలేకుండా ప్రొగ్రమింగ్ లాంగ్వేజ్ డిసైన్ గురించి నేర్చుకోవచ్చు

సమస్య
వ్వాట్సాప్ లో వచ్చిన ప్రతి మెస్సేజు చూసి అందులో కనుక రైస్ [బియ్యం] ప్రసక్తి 10 సార్లకన్నా ఎక్కువ ఉంటే వెంటనే తన తమ్ముడికి ఒక మెసేజ్ పెట్టాలి .. సరుకు పెంచుకోటానికి
ఇందుకోసం getMessagesFromWhatsapp అనే ఒక సాధనం [utilitiy ] వుంది అనుకుందాం.
ఇది జావా లాంటి సాధారణ లాంగ్వేజస్ లో ఇలా ఉండొచ్చు
var messages = getMessagesFromWhatsapp()
var riceCount = 0;
for(var i=0;i<messages.length;i++) {
if(messages[i] === 'rice' ) {
riceCount = riceCount + 1;
}
}
if( riceCount > 10 ) {
sendMessage("More rice")
}
ఇది తెలుగులో ఇలా ఉండొచ్చు
getMessagesFromWhatsapp() మెసేజులు అనుకో
0 బియ్యం అనుకో
మెసేజులు లో ప్రతి మెసేజు తో
బియ్యం కానీ రైస్ కానీ అయితే బియ్యం లెక్క పెంచు
బియ్యం 10 దాటితే "బియ్యం తే" అని మెసేజ్ పెట్టు
ఈ ఊహజనిత ప్రోగ్రాముకి ఇంగ్లీషు ప్రోగ్రామ్ కి తేడా పెద్దగా లేదు కానీ ఈ తెలుగు ప్రోగ్రాములో విషయం చాల సులువు అని తెలుస్తోంది కాదు. నేను నీలం రంగులో పెట్టినవి తెలుగు ప్రొగ్రమింగ్ లాంగ్వేజీ కి సంబంధించినవి
ఇలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తయారు చేయగలమా ? చెయ్యొచ్చు కాస్త సమయం కేటాయించాలి కానీ తప్పకుండ చెయ్యొచ్చు
నాతొ ఎవరన్నా కలిసి పని చెయ్యాలి అని అనుకుంటున్నారా .. నన్ను సంప్రదించండి . ప్రోగ్రామింగ్ అందరికి అందుబాటులోకి తీసుకురావచ్చు .. విఫలమయినా కూడా నష్టంలేకుండా ప్రొగ్రమింగ్ లాంగ్వేజ్ డిసైన్ గురించి నేర్చుకోవచ్చు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి