కరోనా కర్ఫ్యూని సరికొత్త విషయాలు నేర్చుకోవటానికి ఉపయోగించవచ్చు
సమాచారాన్ని అర్ధం చేసుకుంటే పరిస్థితులు అర్ధం చేసుకోవచ్చు ప్రస్తుత కరోనా మహమ్మారిని అంతం చెయ్యటానికి ఇంట్లోనే చాలా మంది ఉంటున్నాము దాని వల్ల కాస్త ఇబ్బందులు పడుతున్నా బస్సులు రైళ్లల్లో ప్రయాణాలు తగ్గటం వల్ల పని తరవాత కాస్త సమయం లభిస్తుంది దానిని సినిమాలు గట్రాలతో పూర్తిగా నింపివేయకుండా మనకి మన జీవితంలో ఏదన్నా ఉపయోగపడేలాగా ఉపయోగిస్తే బోలెడు లాభాలు ఉంటాయి. టైం లేదు నేర్చుకోటానికి అనుకునే మనలాంటి వాళ్లందరికీ ఇది ఒక గొప్ప అవకాశం.
ఎటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా కూడా సమాచారాన్ని అర్ధం చేసుకోవటానికి కొన్ని ఉపకరణాలు ఇస్తుంది. జావా , స్కాలా , క్లోజర్ , పైథాన్ ఏది నేర్చుకోవాలన్న ఇదొక మంచి సమయం. కరోనా వైరస్ వల్ల ఇంట్లో వున్నాం కాబట్టి ఆ వైరస్ సమాచారంతోనే నేర్చుకోవాలనుకుంటే మీకు కావాల్సిన సమాచారం సి ఎస్ వి రూపంలో ఇక్కడ పొందవచ్చు . ఇవన్నీ ఉచితంగానే లభిస్తాయి
https://data.humdata.org/dataset/novel-coronavirus-2019-ncov-cases
ప్రతి రోజు ప్రతి దేశంలో ఎన్ని కేసులు నమోదు అయ్యాయో అలాగే ఎంత మంది దీని బారిన పడి మృతి చెందారో లాంటి బోలెడు సమాచారం లభిస్తుంది .
వీటితో మీరు
1. ఎక్సెల్ లాంటి టూల్ ఉపయోగించి ఛార్ట్స్ వేసి చిత్రాల రూపంలో సమాచారాన్ని అర్ధం చేసుకోవచ్చు
2. ఒక డాటాబేస్ లో ఈ సమాచారాన్ని ఉంచి ఎస్ . క్యు . ఎల్ ( SQL ) ద్వారా సమాచారాన్ని అర్ధం చేసుకోవచ్చు
3. పైథాన్ లాంగ్వేజ్ ద్వారా జ్యుపిటర్ నోటుబుక్కు లో సమాచారాన్ని విశ్లేషించవచ్చు , అది ఎలా చెయ్యాలో నేర్చుకోవచ్చు
మీరు ఎలా ఈ లాక్ డౌన్ సమయంలో కొత్త విషయాలు నేర్చుకున్నారో నేర్చుకుంటున్నారో నాతొ పంచుకోండి
వచ్చే పాడ్ కాస్ట్ లో ఆ విషయాలు మీ అభ్యంతరం లేకపోతే మీ పేరుతో ప్రస్తావిస్తా
ఆరోగ్యం జాగ్రత్త
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి