12, ఆగస్టు 2020, బుధవారం

కంప్యూటర్ లేకుండానే ప్రోగ్రామ్మింగ్ నేర్చుకోవచ్చా ? [Coding without computers]

కంప్యూటర్ లేకుండానే ప్రోగ్రామ్మింగ్ నేర్చుకోవచ్చా ? [కోడ్ ఆట ]

ప్రోగ్రామింగ్ అనేది ఒక ఆలోచనా  సరళి/విధానం ఇది అలవర్చుకోవటానికి కంప్యూటర్ అక్కర్లేదు . చిన్న పిల్లలకి ముఖ్యంగా ఈ కంప్యూటర్ అందుబాటులో లేని మరియు అటువంటి వాతావరణం చుట్టుపక్కన లేనటువంటి గ్రామీణ ప్రాంతాలలో పిల్లలకి చిన్నప్పుడే ఈ తరహా ఆలోచనా విధానాన్ని పరిచయం చెయ్యటం ద్వారా వారిని భవిష్యత్తులో నేర్చుకోవాల్సిన విషయాలకి సంసిద్ధులని చేసిన వాళ్ళం అవుతాము. కొన్ని బోర్డు గేమ్స్ ద్వారా  కొందరు ప్రోగ్రామ్మింగుని  పరిచయం చేయటం చూసాను. మన తెలుగు రాష్ట్రాలలో  పిల్లలకి ఇంకా సులువుగా అర్ధమయ్యేలాగా మా పిల్లకాయలతో కలిసి ఒక చిన్న ఆట  తయారు చేసాము . వాళ్ళు బాగా ఉత్సాహంగా ఆడారు. మీరు కూడా మీకు తెలిసిన పిల్లలకి ఈ ఆతని పరిచయం చేయొచ్చేమో చూడండి. 

ఈ ఆటకి ముగ్గురు పిల్లలు లేక రెండు జట్ల ఆటగాళ్లు కావాలి. సులువుగా ఉండటానికి ముగ్గురు పిల్లల్ని తీసుకుందాము. 

 ఆ.గా 1 , ఆ.గా 2  , మూడవది  తోటరాముడు  

ఈ ఆటలో ముఖ్య ఉద్దేశం కొన్నే కొన్ని ముందే అనుకున్న పదాలు మాత్రమే చెబుతూ  కళ్ళకి గంతలు కట్టుకున్న తోటరాముడు ని ఒక చోటనుండి బంగారం దెగ్గరికి తీసుకెళ్లాలి మరొక ఆటగాడు ముందే నిర్ణయించుకుని కొన్ని అడ్డంకుల్ని కల్పించాలి

ఉదాహరణకి ఆట మొదలయ్యేముందు అనుకున్న పదాలు .. 

1. రెండు అడుగులు ముందుకెళ్లు  [లేక ఆగే దాకా]

2. ఆగు 

3. కుడి వైపు తిరుగు 

(ఈ పదాలని  మెల్లిగా పెంచొచ్చు,  మరింత శక్తిని ఇవ్వొచ్చు  ఉద :అయ్యేదాకా , అయితే  కుడి వైపు తిరుగు )

అలాగే ఆ.గ 2 కి అందుబాటులో వున్నా అడ్డంకులు 

1. లోయ 

2. గోడ 

3.  మెట్టు 

4. బంగారం 

ఇప్పుడు తోటరాముడి కళ్ళకి గంటలు కట్టాలి , ఆ.గ 2 ముందుగానే అడ్డంకులు ఎక్కడ ఉన్నాయో పెట్టాలి (మేము ఇంట్లో గిన్నెలు పెన్నులు పెట్టుకున్నాము ) ఇప్పుడు ఇక ఆ.గ 1 వున్న అతి కొన్ని పదాలతో ఆ అడ్డంకుల్ని దాటించి తోటరాముడ్ని బంగారం దెగ్గరికి చేర్చాలి 


దీనివల్ల పిల్లలు గోల చెయ్యకుండా ఆడుకోవటమే కాదు అతి కొన్ని సూచనలతో పనులు ఎలా చెయ్యొచ్చో ఆలోచించగల్గుతారు. 
మీ అభిప్రాయాలని నాతో పంచుకోండి  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ప్రముఖంగా ..

రామ కోటి

ఐఫొన్లో మాత్రమే సరిగ్గా పనిచేస్తోంది.. బోలెడు తప్పులూ నిదానంగా రామజపం చేస్తూ కిందకి వెళ్ళండి .. సర్రున లాగేస్తే పని చెయ్యదు :-) ...