బ్లాక్ చైన్
సాంకేతిక రంగం మీద కాస్త దృష్టి పెట్టే వాళ్లకి ఇది సుపరిచిత విషయమే
కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లోకి ఇప్పుడే అడుగు పెడుతున్న వాళ్లకి ఇది అంతగా అర్ధం అవ్వకపోవచ్చు సాధారణ ప్రోగ్రామింగ్ విషయాలకన్నా కాస్త భిన్నంగా ఉంటుంది . ఇది తెలుసు కోవటం కష్టమయిన విషయం కాదు కానీ కొత్త విషయం అవ్వటం వల్ల సమాచారం అర్ధమయ్యే రీతిలో లభించటం కష్టం.
బ్లాక్ చైన్ అర్ధం చేసుకువాలంటే డేటాబేస్ లో నిక్షిప్తం చేసే సమాచారం గురించి ఆలోచించాలి . సాధారణ డాటాబేసులో సమాచారం ఒక కంపెనీ లేదా ఒక యాజమాన్యం అధీనంలో ఉంటుంది . దాని మీద హక్కులు కూడా వాళ్ళకే ఉంటాయి .ఆ డాటాబేసులో సమాచారాన్ని చూడాలి అంటే ఆ యాజమాన్యం యొక్క అనుమతి కావాలి. అంటే పారదర్శకత తక్కువగా ఉంటుందన్నమాట. ఇలా కాకుండా సమాచారం మొత్తం అందరికి అందుబాటులో ఉందనుకోండి అప్పుడు ఆ సమాచారం మీద ఆధిపత్యం కేవలం ఒక్కరికి కాకుండా అందరికి ఉంటే ? సరిగ్గా ఇలాంటి ఆలోచనల నుంచి పుట్టిందే "వికేంద్రిత డేటాబేస్"
డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ [distributed ledger ]
ఇలా సమాచారాన్ని అందరికి అందుబాటులో ఉంచే వ్యవస్థ బ్లాక్ చైన్. దీని ముఖ్య ఆశయం ఏ ఒక్కరికి పూర్తి ఆధిపత్యం ఇవ్వకుండా అందరికి సమానంగా సమాచారాన్ని ఉపయోగించుకునే వ్యవస్థ స్థాపించటం. ఇందులో ఎలాంటి సమాచారాన్నయినా నిక్షిప్తం చెయ్యొచ్చు . ఉదాహరణకి డబ్బు విలువ సమాచారం తో బిటీకాయిన్ అనే ఒక సమాంతర నగదు వ్యవస్థ ఏర్పడింది .. ఈ డబ్బుకి రిజర్వ్ బ్యాంకు అవసరం లేదు , ప్రభుత్వ అవసరం లేదు అందరికి హక్కు ఉంటుంది అలాగే ఏ ఒక్కరికి దీని విలువ నిర్ధారించే అధికారం ఉండదు. దాని మంచి చెడులు మనకి ప్రస్తుతం అవసరం లేదు ...
ఇలానే భూమి పైన అధికారాన్ని చెప్పే నోటు పేపర్ల బదులు ఆ సమాచారాన్ని బ్లాక్ చైన్ వ్యవస్థలో చేర్చటంవల్ల ఆ సమాచారంపై ఒక ప్రభుత్వానికి కాకుండా అందరికి హక్కు ఉంటుంది దాని వాళ్ళ ఆ భూ క్రయ విక్రయాదులపై ప్రభుత్వ మధ్యవర్తిత్వం పోగొట్టోచ్చు ..పారదర్శకత పెంచొచ్చు
బ్లాక్ చైన్ లో సమాచారాన్ని బ్లాక్స్ (ఉద: 1 బ్లాక్ అంటే 1 MB సమాచారం) అంటారు ఒకొక్క బ్లాక్ కి తరువాత వచ్చే బ్లాకు ఒక గొలుసులాగా అనుసంధానం చేస్తారు .. రైలు పెట్టెల్లాగా మీరు ఊహించవచ్చు
ఒకసారి బ్లాక్ చైన్ లో సమాచారం స్టోర్ చేసాక ఆ సమాచారాన్ని మార్చలేం .. దీనినే ఇమ్మ్యూటబిలిటీ అంటారు అంటే మార్పు కి అవకాశం లేనిది అని
ఒక ప్రోగ్రామర్ గా మీరు చెయ్యాల్సింది
1) డేటాస్టోరేజ్ ఒక చోట కాకుండా బ్లాక్ చైన్ లో వుంది అని గుర్తించటం ,
2) అలాగే ఆ బ్లాక్ చైన్ పై సమాచారాన్ని ఎలా రాయొచో తెలుసుకోవటం , దానిని మళ్ళీ ఎలా చదవచ్చొ తెలుసుకోవటం
3) సమాచారాన్ని ఎవరు రాయాలి అనేది కూడా కాస్త భిన్నంగా ఉంటుంది , మైనింగ్ అంటే ఏంటో తెలుసుకోవటం అవసరం
ఈ విషయాలమీద మరింత సమాచారం పాడ్ కాస్ట్ లో వినొచ్చు
మీ అభిప్రాయాల్ని/ప్రశ్నలని నాతో కామెంట్స్ లో పంచుకోండి
సెలవు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి