5, జనవరి 2020, ఆదివారం

క్లౌడ్ అంటే ?

క్లౌడ్ అంటే ?

మనం ఏదన్నా ప్రోగ్రాం రాస్తే అది ఎక్కడో అక్కడ పని చెయ్యాలి. ఉదా: మీ మొబైల్ ఫోన్ లో వున్న రక రకాల యాప్స్ ఇలాంటి ప్రోగ్రాంలే కదా

అలాగే కొన్ని ప్రోగ్రాములు ఓక  ప్రత్యేకమయిన కంప్యుటర్లో పని చేస్తూ ఉంటాయి మనకి కావలసినప్పుడు ఆ కంప్యూటర్ దెగ్గరికి వెళ్లి ఆ ప్రోగ్రాంతో పని ముగించుకుని వస్తాము . ఉద: మీ బ్యాoక్  ఖాతా లో డబ్బులు ఎంతఉన్నాయో చూడాలంటే ఆ బ్యాOకు వాడి కంప్యూటర్కి ఇంటర్నెట్ ద్వారా వెళ్లి అడిగి తెలుసుకుంటారు

ఈ ఇంటర్నెట్ ద్వారా చేరుకున్న కంప్యూటర్ ఆ బాంక్ వాడు నడిపే డాటా సెంటర్ లో ఉంటే దాన్ని బాంక్ వాడి ఆన్ ప్రెమ్ (ON-PREM) లో నియోగించటం  (deployment ) అంటారు

ఎవరి డేటా సెంటరు వాళ్ళు నడుపుకోవటం అంత  సులువయిన పని కాదు ఎప్పటికప్పుడు కంప్యూటర్లు బాగా పని చెయ్యటానికి కావాల్సిన నైపుణ్యం పదును పరుచుకోవాలి అలాగే కొత్త కంప్యూటర్లు అవసరాన్ని బట్టి కొనుగోలు చెయ్యాలి, వాటి మరమత్తులు వాటి రక్షణ వ్యవస్త సంగతులు సరి చూసుకుంటూ ఉండాలి.
ఈ పనులన్నీ చూసుకుంటూ ఆ బాంకు తాలూకు మౌలికమయిన వ్యాపారలావాదేవీలు చూసుకోవటం అందరికి సాధ్యమయ్యే పని కాదు.

అసలు ఈ ప్రోగ్రామ్లను వేరే  వాళ్ళ కంప్యుటర్లు అద్దెకి తీసుకుని  వాటిలో పని చేసేలాగా చేస్తే ? ఇలాంటి ఆలోచననుంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్ (మౌలిక సదుపాయాల) యాస్ సర్వీస్ సంస్థలు ఏర్పడి వారి కంప్యూటర్లని అద్దెకి ఇవ్వటం ప్రారంభించాయి. వీటిలో అత్యంత ప్రాచుర్యం పొందిన వాటిలో అమెజాన్ ఒకటి.

మీ సొంత బంగ్లాల్లో కంప్యూటార్లు బదులు ఎక్కడో ఇంటర్నెట్ లో  దూరంగా ఆకాశం లో వున్నట్టుగా వున్న కంప్యూటర్లను   అద్దెకి తీసుకుని వాటిలో ఆ ప్రోగ్రాములు పని చేసేలా చెయ్యటాన్ని క్లౌడ్ కంప్యూటింగ్ అని నామకరం చేశారు ... ఇది ఒక ఊత పదం అయిపోయింది. ఇది కొత్త విషయం ఏమి కాదు ఇంటర్నెట్ ప్రాచుర్యంలోకొచ్చినప్పట్నుంచి చాల వెబ్ సై ట్స్ ఇలాంటి అద్దె కంప్యూటర్లోనే నడిచేవి. కానీ మొత్తం వ్యవస్థల కంప్యూటర్లని ఎన్ని కావాలంటే అన్ని కాల్పనిక (virtual )  కంప్యూటర్లను క్షణాల మీద ఇవ్వగలిగటం వల్ల , సంస్థల యాజమాన్యానికి కంప్యూటర్ల ఖర్చు అలాగే వాటిని నడిపే నిపుణుల ఖర్చు తగ్గటం వాళ్ళ ఇంకా ప్రాచూర్యం లభించింది

దీని వల్ల  కొత్త సమస్యలు రాకపోను లేదు. అన్ని కంప్యూటర్లని అమెజాన్ లాంటి సంస్థలు నిర్వహిస్తూ ఉండటం వల్ల అక్కడ వచ్చే సాంకేతిక ఇబ్బందులు అన్ని కంపెనీలకి నష్టాన్ని కలిగించవచ్చు. అలాగే నియంత్రణ వేరే వారిదెగ్గర ఉండటం వాళ్ళ ఖర్చు మీద నియంత్రణ తప్పవచ్చు. వేరే చోట ప్రోగ్రాములు పని చెయ్యాలి కాబట్టి ప్రోగ్రాములని అక్కడికి చేర్చటానికి ఒక వ్యవస్థ కావాలి. ఇలాంటి రక రక కొత్త పనిముట్ల గురించి వచ్చే శీర్షికల్లో తెలుసుకుందాము.


సెలవు



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ప్రముఖంగా ..

రామ కోటి

ఐఫొన్లో మాత్రమే సరిగ్గా పనిచేస్తోంది.. బోలెడు తప్పులూ నిదానంగా రామజపం చేస్తూ కిందకి వెళ్ళండి .. సర్రున లాగేస్తే పని చెయ్యదు :-) ...