21, జనవరి 2024, ఆదివారం

రామ కోటి

ఐఫొన్లో మాత్రమే సరిగ్గా పనిచేస్తోంది.. బోలెడు తప్పులూ
నిదానంగా రామజపం చేస్తూ కిందకి వెళ్ళండి .. సర్రున లాగేస్తే పని చెయ్యదు :-)

24, జనవరి 2021, ఆదివారం

యంత్ర భయం

 

యంత్ర భయం

అమ్మో... కృత్రిమ మేధస్సు కలిగిన యంత్రాలు మానవులని సర్వనాశనం చేస్తాయేమో !

మానవుల మేధస్సు వలే పని చేయగలిగిన యంత్రాలు మానవుని జీవనోపాధిని మింగేస్తాయేమో !

మొన్నామధ్య  టెస్లా అధినేత యంత్రాల మేధస్సు ఎల్లలు దాటితే  ఎన్నో ప్రమాదాలకు దారి తీయచ్చు అనే భయాన్ని వ్యక్త పరచగానే ఎన్నో చర్చలు మొదలయ్యయి. వీటిలో నిజాలు ఎన్ని ? అసలు కృత్రిమ మేధ అంటే ఏంటి ?

మానవులకే కాదు బోలెడు జీవ రాసిలో   వేల సంవత్సరాల పరిణామక్రమంతో పరిపుష్టమైన మస్తిష్కం ఒక అధ్బుతం. దీనివలన ప్రసరించే చైతన్యం, వివేకం , తెలివితేటలు వేల సంవత్సరాలుగా ఎందరో మహానుభావులని వీటి పుట్టుక,  పదార్ధాలతో సంబంధం గురించి ఆలోచించేలా చేశాయి.
బొమ్మలకు అటుతరువాత యంత్రాలకు అటువంటి మస్తిష్కం సాధ్యమేనా అనేది పాత ప్రశ్నే!  యాభయ్యవ దశకంలో లిస్ప్ శృష్టి కర్త మెకార్తీ ఉపయోగించిన   కృత్రిమ మేధ అనే ఈ పదం ఎప్పటికప్పుడు కొత్త అర్ధాన్ని వ్యక్తపరుస్తూనే వుంది.

  ఆ రంగంలో పని చేస్తున్నవారికి ఆ పదాన్ని ఎలా వాడాలో దాని పరిమితులేంటో బాగా తెలుసు. ఎటొచ్చీ పేరు మాత్రమే విన్నవారికి, నవలలు, చలన చిత్రాల వలన ఒక అద్బుతమయిన ఇంద్రజాల సదృశంగా గోచరిస్తుందనటంలో అతిశయోక్తి లేదు. ఆ పరిజ్ఞ్యాన లేమి  భయాన్ని కూడా కలిగిస్తూ వుంటుంది. 

ఎన్నో రకాల సమస్యలను సాంఖ్యకశాస్త్ర [statistics] పద్దతులు ఉపయోగించి గణన యంత్రాల సహాయంతో సమాధానాలను అంచనా వేస్తూ, తప్పులు వచ్చినప్పుడు ఆ సంఖ్యలను సరిచేసుకుంటూ ఒక ప్రత్యేక అవసరం కోసం రూపొందించిన ఈ యంత్రాలు మానవ మస్తిష్కానికి పోటీ కాలేవు అని కొందరి అభిప్రాయం.

మరి చదరంగం , గో లాంటి (గూగుల్ వారి ఆల్ఫా గో) వాటిలో అబ్బురపరిచే విజయాల మాట ఏమిటి ?  తనంతట తానుగా గో లాంటి క్లిష్టమయిన ఆటను నేర్చుకుని దానిలో  ప్రపంచ విజేతగా నిలవటం వెనుక మానవ మేధస్సు వుంది.  సంవిశ్వాస (Reinforcement Learning) గణనాల ద్వారా, వేల వేల ఉదాహరణలతో లెక్కకు అందని యంత్ర శక్తితో లెక్కిచగా ఒక పని చెయ్యటం సాధ్యపడుతుంది. దీనిలో కొందరు శృజనాత్మకతని చూస్తున్నారు .. కొందరు లెక్కలే అని  కొట్టి పారేస్తున్నారు.  
 
ఈ కృత్రిమ మేధ రేపో మాపో రాబోయే యంత్రం కాదు నిన్నా మొన్నా ఈ రోజూ  మన జీవితాలతో పెన     వేసుకుపోయింది. మన చరవాణిలో మనకి సమాయానుకూలంగా చూపించే సందేశాల మొదలుకుని మనకి జాలవాటిలో  కనిపించే  ప్రకటనల దాకా కృత్రిమ మేధా పద్దతుల సాక్షాత్కారమే. నిన్న వచ్చిన కరోనా మహమ్మారికి మందు, రేపు రాబోయే రవాణా వ్యవస్థల సమర్ధతకి ఇదే కుడిభుజం. 

  

ఉపయోగకరమయిన పేలుడు పదార్ధాలు తయారు చేసిన నోబెల్ ఆ పదార్ధాలు తరువాతి కాలంలో లక్షల ప్రాణాలు బలికోంటుందని ఊహించి వుండకపోవచ్చు . అలాగే ఈ మేధ ప్రాణాంతకమయిన ఆయుధాల తయారీలో ఇప్పటికే ముఖ్య భూమికని పోషిస్తోంది అనటంలో సంశయం అనవసరం. ఈ భయంతో ప్రగతికి అడ్డుకర్రలు వెయ్యలేము. పాలకులు దుండగుల ని ఒక కంట కనిపెడుతూనే  ఈ రంగంలో జరిగే అభివృద్ధి తో భాష , వ్యవసాయం , అక్రమాలకు అడ్డుకర్ర , అరోగ్య వ్యవస్త మరియూ పాలనలో సమర్ధత లాంటి ఎన్నో ఉపయోగాలను అందిపుచ్చుకోవచ్చు . 
 
భారత్ కు సంబంధించినంత వరకూ ఈ రంగంలో ప్రభుత్వం ఉదాసీనత చూపుతోంది అనటం కాదనలేని సత్యం.  ప్రజలకు అర్ధమయ్యేలాగ వారి భాషల్లో విషయాలని ప్రచురించకపోవటం మొదలుకుని పరాయి భాషల్లో విద్యావవస్థ వల్ల కోట్ల మందిని ఈ విప్లవంలో భాగస్వాములు కాకుండా నిరోధిస్తున్నాయి.  ఈ పరిజ్ఞాన లేమిని దుండగులు వారి లాభాలకు వాడుకున్నా మనం చూస్తూ వుండటం వినా చెయ్యగలిగినది శూన్యం.

 

 
ఇందులో యంత్రాలకన్నా,  వాటి మేధ కన్నా  భయపడాల్సినది యాంత్రిక విద్యా  వ్యవస్థకు , ఉదాసీనతకు.


        


 



  



23, జనవరి 2021, శనివారం

అనుయోజన భాష - GraphQL in telugu


గ్రాఫ్ క్యు.ఎల్ విహంగవీక్షణం అవశ్యకత .. ప్రత్యామ్నాయాలు
సాఫ్ట్‌వేర్ రూపకల్పనలో అవసరం ఏంటో ఈ కార్యక్రమంలో తెలుసుకుందాము




26, డిసెంబర్ 2020, శనివారం

ప్రోక్సీ , రివర్స్ ప్రోక్సీ అంటే ఏంటి


ప్రోక్సీ , రివర్స్ ప్రోక్సీ అంటే ఏంటి ?
సాఫ్ట్‌వేర్ రూపకల్పనలో ప్రతినిధి (proxy) .. వికల్పకాల (reverse proxy) అవసరం ఏంటో ఈ కార్యక్రమంలో తెలుసుకుందాము




22, నవంబర్ 2020, ఆదివారం

11, అక్టోబర్ 2020, ఆదివారం

సరళమా సులువా ? Simple or Easy ?

 


సరళమా సులువా ? Simple or Easy ?
సంక్లిష్టతని గమనిచుకుంటూ సరళతరమయిన కల్పనతో సాఫ్ట్వేర్ సృజన ఉపయోగకరమయిన పని అని అనుభవం నేర్పిన పాఠం



28, ఆగస్టు 2020, శుక్రవారం

వర్షన్ కంట్రోల్ - Version Control


వర్షన్ కంట్రోల్ - Version Control
ఉద్యోగాల్లో చేరాక వెర్షన్ కంట్రోల్ లేకుండా అడుగు ముందుకు సాగదు ..అలాంటప్పుడు దాని మీద అవగాహన ముందుగానే వుండటం మంచిది ఈ శీర్షికలో వర్షన్ కంట్రోల్ అంటే ఏంటో చూద్దాం..



12, ఆగస్టు 2020, బుధవారం

కంప్యూటర్ లేకుండానే ప్రోగ్రామ్మింగ్ నేర్చుకోవచ్చా ? [Coding without computers]

కంప్యూటర్ లేకుండానే ప్రోగ్రామ్మింగ్ నేర్చుకోవచ్చా ? [కోడ్ ఆట ]

ప్రోగ్రామింగ్ అనేది ఒక ఆలోచనా  సరళి/విధానం ఇది అలవర్చుకోవటానికి కంప్యూటర్ అక్కర్లేదు . చిన్న పిల్లలకి ముఖ్యంగా ఈ కంప్యూటర్ అందుబాటులో లేని మరియు అటువంటి వాతావరణం చుట్టుపక్కన లేనటువంటి గ్రామీణ ప్రాంతాలలో పిల్లలకి చిన్నప్పుడే ఈ తరహా ఆలోచనా విధానాన్ని పరిచయం చెయ్యటం ద్వారా వారిని భవిష్యత్తులో నేర్చుకోవాల్సిన విషయాలకి సంసిద్ధులని చేసిన వాళ్ళం అవుతాము. కొన్ని బోర్డు గేమ్స్ ద్వారా  కొందరు ప్రోగ్రామ్మింగుని  పరిచయం చేయటం చూసాను. మన తెలుగు రాష్ట్రాలలో  పిల్లలకి ఇంకా సులువుగా అర్ధమయ్యేలాగా మా పిల్లకాయలతో కలిసి ఒక చిన్న ఆట  తయారు చేసాము . వాళ్ళు బాగా ఉత్సాహంగా ఆడారు. మీరు కూడా మీకు తెలిసిన పిల్లలకి ఈ ఆతని పరిచయం చేయొచ్చేమో చూడండి. 

ఈ ఆటకి ముగ్గురు పిల్లలు లేక రెండు జట్ల ఆటగాళ్లు కావాలి. సులువుగా ఉండటానికి ముగ్గురు పిల్లల్ని తీసుకుందాము. 

 ఆ.గా 1 , ఆ.గా 2  , మూడవది  తోటరాముడు  

ఈ ఆటలో ముఖ్య ఉద్దేశం కొన్నే కొన్ని ముందే అనుకున్న పదాలు మాత్రమే చెబుతూ  కళ్ళకి గంతలు కట్టుకున్న తోటరాముడు ని ఒక చోటనుండి బంగారం దెగ్గరికి తీసుకెళ్లాలి మరొక ఆటగాడు ముందే నిర్ణయించుకుని కొన్ని అడ్డంకుల్ని కల్పించాలి

ఉదాహరణకి ఆట మొదలయ్యేముందు అనుకున్న పదాలు .. 

1. రెండు అడుగులు ముందుకెళ్లు  [లేక ఆగే దాకా]

2. ఆగు 

3. కుడి వైపు తిరుగు 

(ఈ పదాలని  మెల్లిగా పెంచొచ్చు,  మరింత శక్తిని ఇవ్వొచ్చు  ఉద :అయ్యేదాకా , అయితే  కుడి వైపు తిరుగు )

అలాగే ఆ.గ 2 కి అందుబాటులో వున్నా అడ్డంకులు 

1. లోయ 

2. గోడ 

3.  మెట్టు 

4. బంగారం 

ఇప్పుడు తోటరాముడి కళ్ళకి గంటలు కట్టాలి , ఆ.గ 2 ముందుగానే అడ్డంకులు ఎక్కడ ఉన్నాయో పెట్టాలి (మేము ఇంట్లో గిన్నెలు పెన్నులు పెట్టుకున్నాము ) ఇప్పుడు ఇక ఆ.గ 1 వున్న అతి కొన్ని పదాలతో ఆ అడ్డంకుల్ని దాటించి తోటరాముడ్ని బంగారం దెగ్గరికి చేర్చాలి 


దీనివల్ల పిల్లలు గోల చెయ్యకుండా ఆడుకోవటమే కాదు అతి కొన్ని సూచనలతో పనులు ఎలా చెయ్యొచ్చో ఆలోచించగల్గుతారు. 
మీ అభిప్రాయాలని నాతో పంచుకోండి  

18, జులై 2020, శనివారం

Data Structure -దత్తాంశ విధానం

దత్తాంశ విధానం / దత్తాంశ రచన 

ప్రోగ్రామింగ్ కోర్సు లో చేరగానే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే  విషయాల్లో డేటాస్ట్రక్చర్ ఒకటా?  ఆలా అయితే ఈ రోజు మాట్లాడే విషయం మీకు ఉపయోగపడగలదు 

మీ దెగ్గర వున్న విషయాన్ని ఏ విధంగా మీరు సమకూర్చుకున్నారో దాన్నే డేటా స్ట్రక్చర్ అంటారు .. అంతకు మించి ఇందులో పెద్ద విషయం ఏమీ  లేదు. ఉదాహరణకి మీరు ఒక గ్రంథాలయానికి వెళ్లారు అనుకోండి మీకు కావాల్సిన పుస్తకం ఆ లక్షలాది పుస్తకాలలో ఎలా వెతుకుతారు ?  రచయిత పేరో లేక పుస్తకం పేరుతోనో ఒక క్రమ పద్దతిలో అక్కడ పుస్తకాలని అమర్చడం వాళ్ళ మీరు సులువుగా మీకు కావాల్సిన పుస్తకాన్ని తీసుకోగలిగారు. అలా కాక ఒక కుప్ప లాగ పేర్చారనుకోండి అప్పుడు ?  
మరొక ఉదాహారణ ఒక మందుల కొట్టు యజమాని మీరు డాక్టర్ రాసిన మందుల చీటి చూడగానే ఫలానా అర దెగ్గరికి వెళ్లి మీకు కావాల్సిన మందో లేక అలాంటి జెనెరిక్ మందునో మీకు ఇస్తాడు . ఆ వ్యక్తికి ప్రతి మందు ఎక్కడ ఉందో  తెలుసా లేక సులువుగా వెతకటానికి అనువుగా మందుల్ని అమర్చాడా ?

అలాగే నిజజీవితంలో ఎన్నో విషయాలు ఒక పద్దతి ప్రకారం సమాచారాన్ని/వ్యక్తుల్ని అమర్చటం వల్ల సులువవుతాయి. 

పుస్తకాలు, మందులు, సినిమా టిక్కట్ల క్యూ, చెత్త సామాన్ల వాడి కాయితాలు గుట్ట ఇవ్వన్నీ ఎదో పని సులువుగా చెయ్యటానికి మార్గాలే . అలానే ఈ విషయాలని కంప్యుటర్లో నిక్షిప్తం చేసుకునేటప్పుడు సులువుగా ఆ సమాచారంతో పని చెయ్యటానికి వాడే మార్గాలకే పెట్టిన పేరు డేటా స్ట్రక్చర్స్  

వాటి పేర్లు, వాటిని ఎలా ప్రోగ్రాం చెయ్యాలి అనేవి పక్కన పెడితే ముందుగా వాటిని ఎలా వాడాలో తెలుసుకుంటే ఉపయోగం ఎక్కువ . కార్ నడపాలంటే ఎలా తయారు చెయ్యాలో తెలియాల్సిన అవసరం లేదు కదా !

సినిమా క్యూ లో మొదట వచ్చిన వాడికి మొదటి టిక్కెట్టు , దీనినే  (first in  first  out ) అంటారు , ప్రింటర్ లో నుంచి వచ్చిన పేజీలు ఒక దాని మీద ఒకటి పెడితే మొదటి పేజీ అన్నిటికంటే ఆఖరున వుంది పోతుంది అందుకే  కాయితాలు తిరగతిప్పి పెడతాము ఒక దాని మీద ఒకటి .. ఒక రాసి లాగ దీన్నే Stack  అంటారు .. ఆఖరున పెట్టినది మొదటి తియ్యగలం .. చెత్త పుస్తకాలవాడు   పుస్తాకాలు ఒకదానిమీద ఒకటి గుట్టగా పెడతాడు . గ్రంధాలయం వాడు అవే  పుస్తకాలని క్రమ పద్దతిలో పెడతాడు. 

ఒక పెద్ద పుస్తంలో విషయాలు సులువుగా వెతకటానికి విషయం సూచి (టేబుల్ ఆఫ్ కంటెంట్స్) లో మనకి కావాల్సిన పేజీ కి వెళ్ల చ్చు  మీ సమాచారాన్ని సులువుగా వెతకటానికి ఒక dictionary  లేక hashmap  లాంటి డేటా స్ట్రక్చర్ వాడచ్చు 

 మీ వంశ వృక్షం  ఒక లాంటి సమాచారాన్ని సులువుగా రాయటానికి ఉపయోగ పడుతుంది. మీ నోట్ బుక్కు మరొక రకమయిన సమాచారాన్ని నిక్షిప్తం చేసుకోగలదు 

ఈ విధంగా మీ సమాచారాన్ని వాడే విధానం బట్టి మీరు నిక్షిప్తం  చేసుకునే విధానం మారుతుంది. ఈ పద్దతులే  డేటా స్ట్రక్చర్స్ 



 






12, జులై 2020, ఆదివారం

అక్షరం - immutability


అక్షరం - immutability ?
అక్షరం.. క్షరం కానిది ...మారనిది మార్పు లేని ప్రోగ్రాములు వల్ల ఉపయోగం ఏంటి ? మార్పు సహజం .. అనివార్యం.. కానీ కంప్యుటర్ ప్రొగ్రాముల్లో మార్పులు మన చెప్పుచేతల్లో ఉంటే వాటి ఖచ్చితత్వాన్ని గుర్తించటం సులువు .. కాని పక్షంలో తల నొప్పులు తెచ్చి పెడతాయి.



4, మే 2020, సోమవారం

కాఫ్కా అంటే ?


కాఫ్కా ఎందుకు ఉపయోగిస్తారు ?
ఒక సరదా ఉదాహరణతో తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాం



ప్రముఖంగా ..

రామ కోటి

ఐఫొన్లో మాత్రమే సరిగ్గా పనిచేస్తోంది.. బోలెడు తప్పులూ నిదానంగా రామజపం చేస్తూ కిందకి వెళ్ళండి .. సర్రున లాగేస్తే పని చెయ్యదు :-) ...